కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం – మాజీ మంత్రి హరీశ్ రావు

పల్లవి, వెబ్ డెస్క్ : మా గోడును పట్టించుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అని వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తో “గత ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదనను వ్యక్తం చేశారు.. వారి సమస్యలను విన్న మాజీ మంత్రి హరీశ్ రావు “ఎవరూ ఆందోళన చెందవద్దని, డిమాండ్లు నెరవేరే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ “మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంత్ సర్కారు కర్కషంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం.పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం.ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి, ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుంది అని గుర్తు చేశారు.