గ్రూప్ 1 నియామకాల్లో కోట్ల కుంభకోణం

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగాలను కాంగ్రెస్ నాయకులు అమ్ముకోవాలని చూశారని,ఒక్కో ఉద్యోగానికి 3 కోట్లు ఇవ్వమని అడిగారని,గ్రూప్ 1 లో 1700 కోట్ల కుంభకోణం జరిగిందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేస్తేనే 30 లక్షలు వసూలు చేస్తామని,అలాంటిది గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ మంత్రి బేరసారాలు చేయడం దుర్మార్గమన్నారు.
పరీక్ష ప్రశ్న పత్రాలు మూల్యాంకనం చేయడం కూడా చేతకాని,కమీషన్ చైర్మెన్ మరియు సభ్యులు రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలన్నారు.
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు.జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని,రాహుల్ గాంధీని తీసుకువచ్చి హామీ ఇచ్చి, ఏ. నిరుద్యోగులైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని బస్సు యాత్ర చేపట్టి ప్రచారం చేశారో,ఆ నిరుద్యోగులనే రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు.కాంగ్రెస్ మరియు బిజెపి నాయకులు యూరియా రైతులకు ఇవ్వకుండా,వారి ఇంట్లో, గోదాముల్లో దాచిపెట్టి రైతులకు బ్లాక్ లో ఒక్కో బస్తా రూ.700 కు అమ్ముతున్నారని మండిపడ్డారు. కేవలం రూ 275 కి ఇవ్వాల్సిన యూరియా బస్తా, కాంగ్రెస్ బిజెపి నాయకులు బ్లాక్ లో అమ్మి దందా చేస్తున్నారన్నారు.
గురుకులాల్లో 60 గ్రాముల గుడ్డలను,42 గ్రాములకు తగ్గించి ధర మాత్రం పెంచి దోచుకుంటున్నారన్నారు. శనగలు మార్కెట్ లో కిలో రూ.89 కి దొరికితే ప్రభుత్వం రూ. 459 కి కిలో అమ్ముతున్నారని,కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు టెండర్ ఇచ్చి దోచుకుంటున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని స్పష్టం చేశారు.అందుకే రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను,కుంభకోణాల గురించి ఊరూరా ప్రచారం చేయాలన్నారు.పట్నం అవినాష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన షాబాద్ మండలానికి చెందిన మాజీ సర్పంచ్,ఎంపిటిసిలు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.