స్మృతి మంధాన రికార్డుల మోత

పల్లవి, వెబ్ డెస్క్ : ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన మూడో మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు స్టయిలిష్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డుల మోత మ్రోగించారు. మొత్తం అరవై మూడు బంతుల్లో పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 125పరుగులు సాధించి మరోసారి సత్తా చాటింది. నలబై మూడు పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది.
412పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన టీమిండియాకు స్మృతి మంధాన యాబై బంతుల్లోనే శతకం సాధించి తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టిన విమెన్ ప్లేయర్ గా చరిత్రకెక్కింది. వన్డేల్లో ఇండియా తరపున ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మంధాన తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఇదే ఏడాది ఐర్లాండ్ జట్టుపై డెబ్బై బంతుల్లో శతకం సాధించింది.
ఈ ఫార్మాట్ లో పదమూడు శతకాలను కొట్టిన రెండో ప్లేయర్ గా కివీస్ జట్టు విమెన్ ప్లేయర్ సుజీ బేట్స్ రికార్డును సమం చేసింది. విమెన్స్ వన్డేల్లో సెకండ్ ఫాసెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా కూడా మంధాన తన పేరును లిఖించుకుంది. ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 2012లో కివీస్ జట్టుపై నలబై ఐదు బంతుల్లోనే శతకం కొట్టారు. ఈ ఏడాది నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా మంధాన రికార్డు సృష్టించింది.