రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
ఈ భేటీలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్టు, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్టు, టీ ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క – సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలూ సైతం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.