బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ “బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రెండోసారి నన్ను నియమించిన సందర్భంగా.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కి, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కుమార్ కి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ కి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు..
బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, గౌరమ్మను పూజించి, ఆంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు ఆటపాటలతో మహిళలు జరుపుకునే ప్రత్యేకమైన పండగ.బతుకమ్మ వైభవాన్ని ఘనంగా చాటేలా బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మహిళా మోర్చా ఆధ్వర్యంలో, 23 సెప్టెంబర్ 2025, సాయంత్రం 3:00 గంటలకు, హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్ ను *బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు ఆవిష్కరించారు.ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో జీఎస్టీని తగ్గించి, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్‌ను ఈ రోజు నుంచి అమలు చేస్తూ, బతుకమ్మ పండుగ మరియు దేవీ నవరాత్రుల సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుక అందించారు.అయితే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల వేళ ఆంక్షలు విధిస్తూ, పోలీస్ పర్మిషన్ ఇవ్వడం లేదు, చివరకు కోర్టు ఆర్డర్ల ద్వారా మాత్రమే పర్మిషన్ తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ, హిందూ మహిళలు అందరూ ఆలోచించాలి. ఇది మన హక్కు, మనం జరుపుకునే పండగకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అన్యాయం.రేవంత్ రెడ్డి గారు… మీరు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తూనే మహిళల హక్కులను మహిళలకు కల్పించండి, మహిళలు స్వేచ్ఛగా పండుగలు జరుపుకునే అవకాశం ఇవ్వండి అని ఆమె కోరారు..
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు గారు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి గారు, సునీతా రెడ్డి గారు, రాష్ట్ర మహిళా మోర్చా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు