సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

పల్లవి, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ కాలంలో కోల్పోయిన రెండు బొగ్గు బ్లాకులను సింగరేణి లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టీ మాట్లాడుతూ “బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి సింగరేణి ప్రవేశిస్తుంది.సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు 819 కోట్ల రూపాయలు దసరా బోనస్ గా ప్రకటిస్తున్నాం. 41 వేల పర్మినెంట్ కార్మికులకు 1,95,610 ఒక్కో కార్మికునికి ప్రకటిస్తున్నాం. 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రతి ఒక్కరికి 5500 బోనస్ గా చెల్లిస్తున్నాం. గతంలో ఎప్పుడూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించిన చరిత్ర లేదు అని తెలిపారు.
పన్నుల కి పోగా సింగరేణికి వచ్చిన లాభం 6394 కోట్లు. ఇందులో సింగరేణి విస్తరణగాను 4034 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. నికరంగా మిగిలిన లాభం 2,360 కోట్లు. ఇందులో 34 శాతాన్ని కార్మికులకు దసరా బోనస్ గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పెడితే గత ప్రభుత్వం పాల్గొనలేదు. ఫలితంగా సింగరేణి ప్రాంతంలో రెండు బొగ్గు గనులు ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు వెళ్లాయి. ఆ రెండు బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లడంతో సింగరేణికి నష్టం చేకూరింది. ఆ రోడ్డు గనుల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిన ఆ బొగ్గు బ్లాకులను తిరిగి తెచ్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం.
సింగరేణి ఒక్క బొగ్గు మైనింగ్ కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రంగంలో మైనింగ్ పై దృష్టి పెట్టాం. సింగరేణి కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ రంగంలో విస్తృతంగా వెళ్లాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది.కర్ణాటకలో కాపర్, గోల్డ్ మైనింగ్ సంబంధించి టెండర్లు పిలవగా సింగరేణి సంస్థ దక్కించుకుంది. ఆ గండ్లను అన్వేషించి తవ్వకాలు చేపట్టి వాస్తవ నిలువలు గుర్తిస్తుంది. భవిష్యత్తులో ఈ మైన్స్ ను దక్కించుకున్న వారు గని జీవితకాలం 35% రాయల్టీ సింగరేణి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది.సింగరేణిని విస్తరించేందుకు PWC ప్రైస్ వాటర్ కూపర్, KPMG వంటి సంస్థలను కన్సల్టెన్సీలుగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో సింగరేణి జెండాను రెపరెపలాడించి తల మాణికంగా నిలబెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన.సింగరేణి తల్లి లాంటిది అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.