ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
TPCC Chief Mahesh Kumar

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపులపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కోట్లాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి వివరణ అడుగుతున్నారు.
తాజాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేశ్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
స్పీకర్ నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యేలందరూ తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాము. తాము పార్టీ మారలేదు. కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము. అంతేకానీ పార్టీ మారలేదని వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.