అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

పల్లవి, వెబ్ డెస్క్ : అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లోవీకే నరేష్ మాట్లాడుతూ* .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్లో 350 మూవీలు చేసి ఉంటాను.. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కూడా ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాను. ఇలాంటి రివ్యూలు నా జీవితంలో ఇంత వరకు రాలేదు. మా మూవీని ఇంత ఆదరించినా మీడియాకు థాంక్స్. నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ మూవీ నాకు మాత్రం ఎంతో స్పెషల్. ప్రతీ ఒక్కరికీ, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుబ్బు మంచి కథను ఇచ్చారు. సాయి కుమార్ కెమెరావర్క్ ఎంతో అందంగా అనిపించింది. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒకే నెలలో సక్సెస్, ఫెయిల్యూర్ చూశాడు. నిండు కుండ తొకణదు అన్నట్టుగా నిర్మాత ఉన్నారు. నీలఖి అద్భుతంగా నటించారు. అంకిత్ కొయ్య ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.