రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

పల్లవి, వెబ్ డెస్క్ : బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘తిప్పరామీసం’ టైంలో విజయ్ ఏడీగా పని చేశారు. ‘మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. విజయ్ కోసం ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ ఇలా అందరూ నాకు ఇష్టం. ప్రియదర్శి ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాడు. ఆయన మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇలానే ఎప్పుడూ మంచి కథలు, సినిమాల్ని చేస్తూ వెళ్లాలి. నిహారిక రీల్స్ నేను చూస్తుండేవాడిని. తెలుగులో ఆమె ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలి. ఈ చిత్రంలో పాటలు బాగున్నాయి. నిర్మాతలైన కళ్యాణ్, భాను, సోము, విజేందర్ అందరూ కూడా నాకు స్నేహితులు. బన్నీ వాస్ గారు నెలకి ఒక సూపర్ హిట్ మూవీని అందిస్తున్నారు. ఆయన ఉన్నారంటే సినిమా హిట్ గ్యారెంటీ. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టే అక్టోబర్ 15న ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ‘మిత్ర మండలి’ ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేస్తుంది’ అని అన్నారు.