నవంబర్ 14న “సీమంతం” విడుదల

పల్లవి, వెబ్ డెస్క్ : టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ‘యద మాటున’ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ… ”మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సీమంతం సినిమా విజయం సాధించాలి అని ఆయన అన్నారు.
అందరికి మంచి పేరు రావాలని, నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ ఆధరించాలి.అలాగే యద మాటున సాంగ్ బాగుందని ఆర్పీ అన్నారు.ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కుతుంది.
రచయిత మరియు దర్శకుడిగా సుధాకర్ పాణి వ్యవహరిస్తున్నారు. సంగీతం ఎస్. సుహాస్ అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటోంది.ఈ సినిమా లో విజువల్స్, మ్యూజిక్ లెవెల్ చాలా హై స్టాండర్డ్‌లో ఉండబోతున్నాయి. నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.