మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణ గారితో కలిసి టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం అరంగ్రేట్రం , సీఎంగా గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రిగా గత పదేండ్లుగా దేశానికి చేసిన పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటోలను వీక్షించారు.
అనంతరం ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న ఆపరేషన్ సింధూర్, అయోధ్యలో రామాలయం నిర్మాణం, త్రిపుల్ తలాక్ రద్ధు, 317ఆర్టికల్ రద్ధు లాంటి పలు సంచలనాత్మక నిర్ణయాలు, మోదీ గారి బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ నేతగా, సీఎంగా, పీఎంగా మోదీ గారి ఘనతల గురించి తెలిసేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ” ఆయన అన్నారు.