వంకాయ తింటే ఆ వ్యాధులకు చెక్..?

పల్లవి, వెబ్ డెస్క్ : వంకాయ అంటేనే వంద మీటర్ల దూరం పోతారు చాలా మంది. కానీ వంకాయ తినడం వల్ల అనేక లాభాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వంకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల, క్యాన్సర్ , కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వంకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వార తీసుకున్న ఆహారం చాలా ఈజీగా జీర్ణమవ్వడంలో దోహదపడుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గించడంలో వంకాయ సహాయపడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి వంకాయ చాలా మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది అని వైద్యులు చెబుతున్నారు.