బడుగు రైతులకు.. ఏదీ భరోసా..?

పల్లవి, వెబ్ డెస్క్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం.. చరిత్రలో ఏనాడూ బాగుపడిన దాఖలాలు లేవు.ఏడాదంతా ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న… ఇవాళ ఎక్కడున్నాడు? పొలంలో పని చేసుకోవాల్సిన రైతు.. ఇపుడు యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగం అవుతున్నాడు. యూరియా కొరత వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచేసే సంక్షోభానికి నిదర్శనం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆరోపించారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన యూరియా లేని పంట ఏమొస్తుంది? పంటలేని రైతు ఏమవుతాడు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మూగబోతూ, రాజకీయ విమర్శలతో, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతోంది. రైతుల జీవితాల్లో మార్పు తెస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు తెచ్చిన మార్పేమీ లేదు… అందరినీ ఏమార్చడం తప్ప” అని పేర్కొన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా విత్తనాలు వేయడమే కాదు, పంట ఎదుగుదల కీలక దశలో ఉంది. పత్తి పూత దశలోకి, వరి పొట్ట దశలోకి వచ్చింది. ఇదే సమయంలో యూరియా అందకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. యూరియా బస్తాల కోసం రైతులు క్యూలలో నిలబడి చేతిలో ఆధార్, పాస్‌బుక్కులు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఎన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా యూరియా బస్తా దొరకదు, అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్పందించదు. ఇదెక్కడి ప్రజా పాలన? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్, ఇతర విపక్షాలు అసెంబ్లీలో యూరియా కొరత, వరద ప్రభావం లాంటి ప్రజా సమస్యలపై చర్చకు ప్రయత్నించగా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా తిరస్కరించడం రాష్ట్రంలోని రైతులందరినీ ఆవేదనలోకి నెట్టింది. కేవలం బురద చల్లుడు రాజకీయాలు మినహా రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆసక్తి లేదు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయ నివ్వకుండా సభను అర్థంతరంగా ముగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని తెలిపారు.
Related News
-
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
నా కొడుకే వైఎస్సార్ వారసుడు – వైఎస్ షర్మిల
-
ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
-
పిల్లలకు ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ తాగిస్తున్నారా..?
-
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం – మాజీ మంత్రి హరీశ్ రావు
-
గ్రూప్ 1 నియామకాల్లో కోట్ల కుంభకోణం