బరువు తగ్గాలనుకునేవాళ్లకు శుభవార్త..!

పల్లవి, వెబ్ డెస్క్ : మారుతున్న జీవనశైలీ, తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర బరువు పెరుగుతున్న ఈరోజుల్లో లావు తగ్గాలనుకునేవాళ్లకు నిజంగా ఇది శుభవార్త. ఈ రైస్ తింటే బరువు తగ్గొచ్చు తెలుసా..?. సహజంగానే నలుపు లేదా ముదురు ఊదా రంగులో ఉండే బ్లాక్ రైస్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డామేజ్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ ను తగ్గిస్తాయి. దీనిద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది.
బ్లాక్ రైస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవచ్చు. బ్లాక్ రైస్ లో ఉండే విటమిన్ ఈ, ఇనుము లాంటివి రోగనిరోధక శక్తిని పెంచి రక్తంలోని చక్కెర లెవల్స్ ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్ రైస్ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది