జౌళి కార్మికులకు తప్పకుండా న్యాయం చేస్తాం – మంత్రి వివేక్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. డా. అంబేద్కర్ విగ్రహం నుండి లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ –సిరిసిల్ల జౌళి కార్మికులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ కోసం కాక స్ఫూర్తితో పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల సమస్యలు పక్కనపెట్టి కుటుంబం కోసం మాత్రమే పని చేశారని విమర్శించారు.
సిరిసిల్లలో సాండ్ మాఫియా వల్ల దళితులు ప్రాణాలు కోల్పోయిన దాన్ని గుర్తుచేశారు.గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అందిస్తున్నామని తెలిపారు.కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేస్తామని, వచ్చే రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయని హామీ ఇచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ల బొట్టు కూడా ఉపయోగం లేదని, కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కవిత స్వయంగా అవినీతి విషయాన్ని బయటపెట్టినా, కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి రాగుల రాములు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.