రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే..?

పల్లవి, వెబ్ డెస్క్ : శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే ప్రతి రోజూ నడవటం, పరిగెత్తడటం లాంటివి చేస్తే మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరం స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం అలవాటు చేసుకుంటే శరీరంలోని ఫ్లెకిబిలిటీ రావడంతో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
యోగా శరీరానికి మంచి ఫిట్‌నె్‌సను ఇవ్వడమే కాకుండా శరీరం బ్యాలన్స్ అవ్వటం వల్ల కండరాలు మరింతగా గట్టిపడతాయి. యోగాసనాల వల్ల ఏకాగ్రత కలుగుతుంది. తలనొప్పులు, వెన్నెముక లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు యోగా అద్భుతమైన ఔషధంలా పని చేస్తుంది. సాఫీగా నిద్ర కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు..