గురుకుల హాస్టల్లో తప్పిన ఘోర ప్రమాదం
Gurukul hostel

పల్లవి, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాల వసతి గృహం భవనం కూలడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలైన సంఘటన వెలుగులోకి వచ్చింది.పాఠశాలలో చదువుతున్న 601 విద్యార్థులకు ఒక పాత భవనంలో వసతి ఏర్పాటు చేసిన అధికారులు, భోజన విరామం సమయం కావడంతో విద్యార్థులంతా తినడానికి వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని విద్యార్థులు చెబుతున్నారు.
భోజనం చేసి హాస్టల్ భవనం ముందు నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా భవనం కూలడంతో ముగ్గురు విద్యార్థులు తిరూర్ జ్ఞానేశ్వర్(10వ తరగతి), శివ(ఇంటర్ ఫస్ట్ ఇయర్), అరవింద్(6వ తరగతి) తీవ్ర గాయాలపాలయ్యారు.గాయాలపాలైన విద్యార్ధులను వెంటనే ఆసుపత్రికి తరలించి, శిథిలాల కింద ఉన్న విద్యార్థుల వస్తువులు తీసే క్రమంలో భవనం పూర్తిగా నేలమట్టమైంది.