ప్రజల బాధలే కాళోజీ గొడవ -మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రజల బాధలే కాళోజీ గొడవ ,కాళోజీ తెలంగాణ ధిక్కార స్వరం అని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో మంగళవారం రోజున కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పూల మాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర, ఆయన తెలుగు ప్రాముఖ్యతను వివరించిన తీరు అమోఘమని, ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు.ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచారని కొనియాడారు.తుది శ్వాస వరకు కూడా సమాజ శ్రేయస్సు కోసం తెలంగాణ స్వరాష్ట్రo కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు.
కాళోజీ నారాయణరావు పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ విజ్ఞాన కేంద్రం నిర్మిస్తామంటే 300 గజాల స్థలం కూడా ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కాళోజీ కాళా క్షేత్రం నిర్మించామని అన్నారు.తెలంగాణ ఏర్పాటు సహా ప్రజల బాధలను కాళోజీ నా గొడవ పుస్తకం కవితల రూపంలో తెలిపారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్
తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్లు ఉడుతల సారంగపాణి, మేకల బాబు రావు, తండమళ్ళ వేణు, హసన్ పర్తి మండల అధ్యక్షులు బండి రజినీ కుమార్, డివిజన్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు, దువ్వ కనకరాజు, పున్నం చందర్, పులి విక్రమ్, నాయకులు రవీందర్రావు, నార్లగిరి రమేష్, రమేష్, నయీముద్దీన్, జానకి రాములు, దూలం వెంకన్న, శ్రీధర్ రావు, మహేష్, రఘు, శ్రీధర్, మూటిక రాజు, రాజ్ కుమార్, రామ్మూర్తి, విద్యార్థి నాయకులు రాకేష్ యాదవ్, ఆర్ కే నరేంద్ర, సృజన్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.