కాంగ్రెస్ దురాశ వల్లనే యూరియ కష్టాలు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ నాయకుల దురాశే కారణమని,వారి అత్యాశవల్లనే యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.ఈ రోజు కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు రైతులు యూరియా ఇవ్వాలని రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతుండగా,ప్రవీణ్ కుమార్ వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై,ఆగస్టు నెలలో టోకెన్లు ఇచ్చి ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయకపోతే రైతులు ఏమై పోవాలని మండిపడ్డారు.కాంగ్రెస్ పాలనలో రోజంతా పొలాల్లో పనిచేసుకోవాల్సిన రైతులు,రోడ్ల మీద,ఆఫీసుల ముందు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి పార్టీ యూరియా ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ యూరియా సరఫరా చేస్తున్నామని అబద్దాలు చెబుతున్నారని,యూరియ అందిన తర్వాత రైతులు రోడ్ల మీదికి ఎందుకొస్తారని ప్రశ్నించారు .కాంగ్రెస్ బిజెపి పార్టీలు అద్దాలతో రైతులను ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు.రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయకుండా,కాంగ్రెస్ బిజెపి నాయకులు రూ.700లకు ఒక యూరియా బస్తా బ్లాక్ లో అమ్ముకుంటూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ బ్లాక్ దందాలో వచ్చిన డబ్బుల మూటలను రేవంత్ సర్కార్ ఢిల్లీకి పంపుతుందన్నారు.యూరియా లారీ లోడ్ వచ్చినా,అది యూరియా కాదని అబద్దాలు చెప్పడం వెనుక బ్లాక్ దందాలే కారణమన్నారు.కనీసం రైతులకు అధికారులు తాగునీరు,షామియానాలు వేయించకుండా అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
యూరియా లారీలు వచ్చినా,మెషిన్స్ లేవని ఇవ్వడం లేదని,రైతులందరూ టోకెన్లు పట్టుకొని వచ్చారని జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతులకు యూరియా ఇచ్చేవారు ఇక్కడనుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.టోకెన్లు పట్టుకొని వచ్చిన రైతులందరికీ అందుబాటులో ఉన్న యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.రైతులందరితో కలిసి కార్యాలయంలోకి వెళ్లి వెంటనే యూరియా సరఫరా ప్రారంభించాలని కోరారు. అనంతరం రైతులతో మాట్లాడి యూరియా ఇస్తామని అధికారులు ఒప్పుకున్నారని,అందరూ ఓపికగా యూరియా తీసుకోవాలని సూచించారు.
కేసిఆర్ హయాంలో రైతులకు ఇలాంటి బాధలు ఎన్నడూ రాలేదన్నారు.బిఆర్ఎస్ రైతుల కంటికి నీరు రాకుండా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నదని గుర్తు చేశారు. మళ్లీ కేసిఆర్ పాలన వస్తేనే రైతులు సంతోషంగా ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్,లెండుగురె శ్యాం రావు,కొంగ సత్యనారాయణ, మండల కన్వీనర్ పార్వతి అంజన్న,నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,గోలెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.