తెలంగాణ రైజింగ్ కాదు…తెలంగాణ ఫాలింగ్.

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ,తెలంగాణ రైజింగ్ కాదు,తెలంగాణ ఫాలింగ్.4 వేల కోట్లతో ఫోర్త్ సిటీకి ఆరు లైన్ల రోడ్డు కోసం,ఆంధ్ర ప్రాంత బిజెపి ఎంపి సిఎం రమేష్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,సిర్పూర్ నియోజకవర్గ ఆదివాసి ప్రాంతాలకు కనీసం రెండు ఖర్చు పెట్టి రోడ్లు వేయడం లేదంటూ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.ఇటీవల సిర్పూర్ నియోజకవర్గంలోని చిన్న మాలిని గ్రామానికి చెందిన కొర్రం శ్రీదేవి అనే గర్భిణి మహిళ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అధిక రక్త స్రావం జరిగి బాబుకు జన్మనిచ్చిన అనంతరం మరణించింది.ఈ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన ప్రవీణ్ కుమార్,రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.స్వేరోస్ ఫౌండేషన్ నుండి ఆ పుట్టిన బిడ్డ పేరు మీద చదివుకున్నంత కాలం నెలకు 2500 రూ అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆ బిడ్డ తల్లి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు,రోడ్డు సౌకర్యం ఉంటే,అంబులెన్స్ వస్తే ఆ మహిళ చనిపోయేది కాదన్నారు.పాడైపోయిన రోడ్డును ఆయన పరిశీలించారు.సిర్పూర్ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం,చిన్న మాలిని రాష్ట్రంలోనే మొదటి ఓటరు ఉండే గ్రామం కానీ అక్కడికే రోడ్డు సౌకర్యం లేకపోవడం అత్యంత దయనీయమన్నారు.అవసరం లేకపోయినా ఫోర్త్ సిటీకి రోడ్లు వేసే ప్రభుత్వం,ఆదివాసుల ప్రాణాలను కాపాడడానికి రోడ్లు వేయదా అంటూ అడిగారు.అటవీ అధికారులు అనుమతి అంటూ సాకులు చెప్పే ప్రభుత్వం ములుగు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ఎలా అనుమతులు వస్తున్నాయని ప్రశ్నించారు.
ములుగులో ఊరూరా రోడ్డు వేస్తున్నారు కానీ సిర్పూర్ లో ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సిర్పూర్ రోడ్ల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సీతక్కకు ఒక న్యాయం,సిర్పూర్ కు ఇంకో న్యాయం చూపడం అన్యాయమన్నారు.కాగజ్ నగర్ రూరల్ మండలంలో సుమారు 5వేల మంది అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారని,వారికి ప్రభుత్వం కనీసం సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.స్థానిక జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ పిఓ మహిళ చనిపోతే కూడా కనీసం ఎందుకు పరామర్శిచలేదని,ఆదివాసీ మహిళ కాబట్టి చనిపోయినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వృత్తి చేసే వ్యక్తి అయినా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుండి ప్రజలకు అందే ఉచిత వైద్యం ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే రోడ్డు వేయడం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.అందుకే ఈ ఎమ్మెల్యే హరీష్ బాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హరీష్ బాబు సొంత గ్రామానికి 80 ఫీట్ల రోడ్డు వేసుకుంటున్నారు.కానీ వెనుకబడిన అటవీప్రాతాలను మరిచారు.గతంలో ఆదివాసీ ఓట్లతో గెలిచిన కోనప్ప, ఈ ఆదివాసీ ప్రజలను వాడుకొని కలప వ్యాపారం చేసుకుని దోచుకున్నారు కానీ ప్రజలకు ఎలాంటి సహాయం అందిచలేదని గుర్తు చేశారు.స్థానిక ఎంపి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికి కనీసం ఎంపి ఫండ్స్ తో రోడ్డు కూడా వేయించలేకపోతున్నారని విమర్శించారు.ఈ ప్రాంత ప్రజలకు బిజెపి,కాంగ్రెస్ పార్టీలతో న్యాయం జరగదని,కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని,ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రోడ్డు,వైద్యం,విద్య వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చిన్నమాలిని గ్రామస్థులు బిఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.