సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

పల్లవి, వెబ్ డెస్క్ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. రేవంత్‌పై టీబీజేపీ దాఖలుచేసిన పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌పై టీబీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అప్పటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-125 కింద కేసు కొనసాగుతుందని కోర్టు తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేయడంతో హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఆ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కొట్టివేసింది. రాజకీయ నేతలు మరీ సున్నితత్వంతో ఉంటే బావుండేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.