రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar

పల్లవి, వెబ్ డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముగ్గురు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు..ఈ సందర్భంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో “యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది..!.వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇన్చార్జిగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు యూరియా కొరత అనేదే ఉంది..!
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలను ఒప్పించి ఉమ్మడి జిల్లాకు సరిపోయే రీతిలో యూరియాను తెప్పించడంలో జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు..!.మంత్రులు జిల్లాను వదిలి హైదరాబాద్ హోటల్లో మీటింగ్లు…సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నది.నిజానికి నెలరోజులుగా రైతులు అల్లాడుతున్నా.. ఇన్చార్జి మంత్రి గానీ, జిల్లా మంత్రులు గానీ కొరత తీరుస్తామని స్పష్టమైన ప్రకటన చేసిన దాఖలాలు లేవు…యూరియా లేనిది అడిగితే కేంద్రం ప్రభుత్వం ఇవ్వడం లేదని మంత్రుల సమాధానం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా నిద్రాహారాలు మాని పడిగాపులు గాస్తున్నారు. నెల రోజులుగా సాగు పనులు వదిలి, కోడికూ యక ముందే సహకార సంఘాల వద్దకు చేరుకొని క్యూ కడుతున్నారు. అయినా దొరక్కా తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే.. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే చెప్పులను లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చుక్క తెగి పడినట్టు ఎప్పుడో ఒకసారి.. ఆయా ప్రాథమిక సహకారం సంఘాలకు యూరియా లోడ్ వస్తే అక్కడికక్కడే అయిపోతున్నది.అందులో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కండ్లకు కనిపిస్తున్న, యూరియా కొరతకు పరిష్కారం చూపాలన్న సోయి పాలకులకు లేకుండా పోయింది.ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీర్చడానికి తీసుకున్న చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు