శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్కులర్లను జారీ చేశారు. వీరు రూ. 60కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కోఠారి పిర్యాదు చేశారు.
ఆ పిర్యాదులో తన కంపెనీ నుంచి 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి కింద 60.4 కోట్ల రూపాయలను ఇచ్చినట్లు దీపక్ కొఠారీ పేర్కొన్నారు. అయితే తాను ఇచ్చిన ఈ సొమ్మును తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈకేసులో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడిన సంగతి విధితమే. ఈ కేసుపై గత ఏడాది ఎన్ఎస్ఎల్టీ విచారించిందని శిల్పాశెట్టి దంపతుల తరపున న్యాయవాది తెలిపారు.