CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి లోని జడ్పీ కార్యాలయం లో జిల్లాలో ఉన్న కేజీబీవీ , మోడల్ స్కూల్స్ , రెసిడెన్షియల్ పాఠశాలల లో CSR నిధులతో చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ సమావేశం లో జిల్లాలో ఉన్న కేజీబీవీ , మోడల్ స్కూల్స్ , రెసిడెన్సియల్ పాఠశాలలలోని విద్యార్థుల హాస్టల్ నిర్వహణ కు అవసరమైన సదుపాయాల కల్పన , బెడ్స్ , కిచెన్ సామాగ్రి , టేబుల్స్ , ప్లేట్స్ , బుక్స్ , డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు , స్పోర్ట్స్ కిట్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పై CSR నిధులతో జిల్లాలో చేపట్టే పనులపై నివేదిక ను సమర్పించాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహా దిశానిర్ధేశం చేశారు.
జిల్లాలో ఉన్న కేజీబీవీ , మోడల్ స్కూల్స్ , రెసిడెన్సియల్ పాఠశాలలలోని విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ రంగం లోని స్కూల్స్ లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా , వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్‌లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య