బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా బీజేపీలో చేరతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ మాట్లాడుతూ ” మీరు, మీ ముఖ్యమంత్రి ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కారీలను రహాస్యంగా కలిశారని అందరికీ తెలుసు. కాళేశ్వరం పై సీబీఐ విచారణ అంటూ దేశంలోనే నంబర్ వన్ పోలీసు వ్యవస్థ అయిన మనవాళ్లను మీరు అవమానించినట్లే అని ఆయన ఎద్దేవా చేశారు.
మీరు ఇప్పుడు కాకపోయిన ఎప్పటికైనా రేవంత్ రెడ్డితో కల్సి బీజేపీలో చేరడం ఖాయం అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తుంటే మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు.