ఆయిల్ పామ్ సాగులో దేశానికి తెలంగాణ ఆదర్శం – మంత్రి తుమ్మల

పల్లవి, వెబ్ డెస్క్ : ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యాప్తంగా మొత్తం పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనీ మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు .
తరచూగా ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పామాయిల్ గెలలు నిల్వ ఉండకుండా క్రషింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా వచ్చిన పామాయిల్ గెలలు అప్పారావు పేట ఫ్యాక్టరీకి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అనంతరం మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడుతూ 31 జిల్లాల్లో ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట పామాయిల్ రిఫైనరీని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్‌లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర