మానవ సేవతోనే సమాజ వికాసం- మంత్రి శ్రీధర్ బాబు

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రతి ఒక్కరూ ‘మానవ సేవే – మాధవ సేవ’ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బాచుపల్లిలో ‘కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 & ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కృషి చేస్తే సరిపోదు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘సమాజం మనకేమిచ్చిందన్నది కాదు, మనమేమిచ్చామన్నది ముఖ్యం. అన్నదానంతో పాటు విద్యాదానం చాలా ముఖ్యం. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం. అందరికీ ఆదర్శనీయం’ అని కొనియాడారు. ‘సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే కాదు. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సేవే. ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవు. అవి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర