సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajgopal Reddy

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మర్రిగూడెం మండలం, కుదాబక్షపల్లి గ్రామంలో పాశం ధర్మ రెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు పాశం కిరణ్ కుమార్ రెడ్డి మరియు శంకర నేత్రాలయ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత కంటిపొర వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..
కంటిపుర సమస్య ఉన్నవారికి వెంటనే మొబైల్ ఆపరేషన్ థియేటర్లో అక్కడే ఆపరేషన్ చేసే విధంగా ఏర్పాటుచేసిన మొబైల్ ఆపరేషన్ థియేటర్ ని కూడా ఆయన ప్రారంభించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమని ఇక్కడ ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు…
తనకు రాజకీయాల కంటే సామాజిక కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తానని… నియోజకవర్గ వ్యాప్తంగా 18 రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రభుత్వ నుండి వచ్చే నిధులను వాడుకుంటూనే నాతోపాటు దాతల సహాయంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు… ప్రతి గ్రామంలో 10 మంది వరకు ధనవంతులు ఉంటారని ఆ పది మంది ధనవంతులు బయటికి వచ్చి గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తే పేదరికం అనేది ఉండదని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు…