తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు

పల్లవి, వెబ్ డెస్క్ : జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈసందర్భంగా వైద్య పరికరాల తయారీలో తమ కంపెనీకి చెందిన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్తీకరించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబందించి అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఈక్విప్‌మెంట్‌తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కోరారు.
Related News
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!