లోకేశ్ పై క్యాబినెట్ ప్రశంసలు

పల్లవి, వెబ్ డెస్క్ : గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులు నారా లోకేశ్ ను అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారంటూ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేశ్ ను ప్రశంసించారు.
డీఎస్సీ జరగకుండా దాదాపు డెబ్బై రెండు కేసులు వేసినా కానీ మంత్రి లోకేశ్ దీటుగా నిలబడి ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా బాగా నిర్వహించారని కొనియాడారు. మరోవైపు పోలీసుల్లో కొంతమంది డీఎస్సీకి ఎంపికయ్యారని, దాంతో ఆ శాఖాలో ఖాళీలు ఏర్పడతాయని మంత్రివర్గం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే, పోలీసు శాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేసేందుకు ఏవైనా న్యాయపరమైన చిక్కులు వచ్చినా, ఎదుర్కొందామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.