అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఈనెల ఆరో తారీఖున జరగనున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది.
అయితే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నందున రద్దయినట్లు సమాచారం. ఈ నెలలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది.