ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!

పల్లవి, వెబ్ డెస్క్ : వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. గత కొన్ని వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం పలు రకాలుగా ఇటు రైతులు, అటు ప్రతిపక్షాలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లారకముందే రైతులు అయితే యూరియా అమ్మేదుఖాణాల దగ్గరకెళ్లి మరి క్యూ లైన్లో నిల్చుంటున్నారు.
ఈ క్రమంలో తనకు యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదని, రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన రైతు ఇంటికి నేరుగా పోలీసులు వెళ్లిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్మణ్ యాదవ్ అనే రైతు ప్రశ్నించారు. దీంతో పోలీసు అధికారి అతని ఇంటికెళ్లారు. రైతుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారి ఇంటికెళ్ళి మరి పోలీస్ స్టేషన్‌కు రావాలని తెలిపారు. అయితే దీనిపై పోలీసు అధికారులు స్పందించాల్సి ఉంది.