నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఎంపీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా తాను బీఆర్ఎస్ కు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దాని వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే కడియం శ్రీహారి మాట్లాడుతూ ” నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిక్కర్ స్కాంలో ఉండటం, ఆ కేసులో అరెస్ట్ అవ్వడమే నచ్చక తాను పార్టీకి రాజీనామా చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఇప్పటికే సుప్రీం కోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహారి పార్టీ మార్పు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.