సోనియా గాంధీకి బిగ్ షాక్

పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీకి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఓటు చోర్ అంటూ ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ చేస్తున్న కార్యక్రమానికి దీటుగా ఈసీఈ తో పాటు అధికార బీజేపీ పార్టీ నేతలు స్పందిస్తున్న తరుణంలో సోనియా గాంధీకి మరోవైపు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వనున్నాయా..?. అంటే అవుననే అన్పిస్తుంది.
సోనియా గాంధీకి భారతదేశ పౌరసత్వం అధికారికంగా లభించడానికి మూడేళ్లు ముందు అంటే 1980లోనే ఆమెకు ఓటుహక్కు రావడమే కాదు ఓటరు జాబితాలో ఆమె పేరును చేర్చారు. దీంతో ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో ఓ క్రిమినల్ పిర్యాదు సోనియా గాంధీ గురించి దాఖలైంది. ఇందుకు ఆమే నకిలీ పత్రాలను ఉపయోగించి ఉంటే ఇది శిక్షార్హమైన నేరమని పిటిషనర్ ఈ సందర్భంగా ఆరోపించారు.
వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ఫిర్యాదుపై అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా నిన్న గురువారం ప్రాథమిక వాదనలు విన్నారు. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు.