ఘాటీ పై అంచనాలు పెంచేసిన లేటెస్ట్ ట్రైలర్

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన తాజా మూవీ ‘ఘాటి’ .. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ నటిస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అనుష్క మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ అనుష్క పై క్రేజీ పెరిగేలా చేశాయి. లేటెస్ట్ యంగ్ రెబల్ స్టార్ , పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ అయితే అంచనాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది.
ఘాటీ మూవీలో అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. స్వీటీ చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంది ఈ ట్రైలర్.ఈ నెల సెప్టెంబర్ 5న (రేపు) ఈ చిత్రం థియేటర్లోకి రానున్నది.. ఇంకొన్ని గంటల్లో తెరపై శీలావతి ఊచకోతను చూడబోతున్నాం. ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతికి మించి ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.