కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించారు. యూకే పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ సుప్రీం. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారం ఉన్న లేకపోయిన నమ్ముకున్న వారికి, ఓట్లేసిన ప్రజలకు సేవ చేయడమే తనకు కేసీఆర్ నేర్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ఎస్ఎల్బీసీ కృంగితే మాట్లాడని రేవంత్ రెడ్డి మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. గత ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఆయన తెలిపారు. హైడ్రాతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు