మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య

పల్లవి, వెబ్ డెస్క్ : గోవా రాష్ట్రంలో శనివారం ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ ఆర్గనైజ్ చేసిన సెమినార్లో వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య పాల్గన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల శక్తివృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ… చిన్న మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% తేడా ఉన్నట్లు వివరించారు. 405 మిలియన్ల మంది మహిళలు ఇంకా డిజిటల్ ప్రపంచానికి చేరుకోలేదని, దీని వల్ల మహిళల అభివృద్ధికి పెద్ద ఆటంకమవుతున్నట్లు తెలిపారు.
భారతదేశంలో 75% మహిళలు మాత్రమే మొబైల్ ఫోన్ కలిగి ఉండగా, స్మార్ట్ ఫోన్ వినియోగం కేవలం 35% మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ డిజిటల్ గ్యాప్ వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్య సేవలు పొందడంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు.మహిళల పురాతన శక్తి ప్రతీకగా వరంగల్ ప్రాంతంలోని చారిత్రక ఘటనలను వివరించారు. కాకతీయ రాణీ రుద్రమదేవి నాయకత్వం, సమ్మక్క – సారలమ్మ పూజలు వంటి చారిత్రక సంఘటనలతో మహిళల శక్తిని కావ్య వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, వడ్డిరహిత రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలను విడుదల, ఆరోగ్యసేవలకు 10 లక్షల వరకూ సౌకర్యం, 2,500 నెలకు ఆర్థిక సహాయం వంటి సమర్థమైన పథకాలు అమలు అవుతున్నట్లు ఎంపీ కావ్య వివరించారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్