వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులందరూ అనేక ఉద్యమాలు, నిరసనలు చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్రంలో పలుచోట్ల భారీగా క్యూలైన్లల్లో రైతులు కన్పిస్తున్నారు. తెల్లారుజామున నుంచే ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ విషయం గురించి నల్గోండ కాంగ్రెస్ ఎంపీ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” వచ్చే సీజన్ కోసం యూరియా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతులు క్యూలో నిల్చుంటున్నారని ” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రఘువీరారెడ్డి ఇంకా మాట్లాడుతూ ‘రైతులు అమాయకులు. వచ్చే సీజన్ కోసం… యూరియా నిల్వ చేసుకుందాం అనకుంటున్నారు.అందుకే లైన్లు కడుతున్నారు’ అని అన్నారు.