నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నోటీసులకు రిప్లయ్ ఇచ్చారు. తాజాగా గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను. బీఆర్ఎస్ కున్న ముప్పై ఏడు ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేని. కేవలం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులను కలిశాను అని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.