గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో టీటీసీ భవన్ కార్యాలయంలో నిన్న శనివారం సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆదిలాబాద్, మెదక్ , కరీంనగర్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి , అడిషనల్ కలెక్టర్ . గరిమ అగర్వాల్ , రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి , వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారోత్సవం లో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకపాత్ర అని తెలియచేయడం జరిగింది.




