అల్లు కనకరత్నంకు ఎంపీ వద్దిరాజు నివాళులు
vaddiraj ravichandra

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్,గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు స్వర్గీయ అల్లు కనకరత్నం చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.
సుప్రసిద్ధ హాస్య నటుడు దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, మెగాస్టార్ చిరంజీవి అత్త,ప్రముఖ నిర్మాత అరవింద్ మాతృమూర్తి కనకరత్నం ఆగస్ట్ 30వతేదీన మృతి చెందగా,దిశదిన కర్మకాండ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగింది.
ఈ కార్యానికి బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కమలాకర్, జగదీష్ రెడ్డిలు హాజరై ఆమె చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.దివంగత కనకరత్నం కుమారుడు అరవింద్,మనవళ్లు అర్జున్, శిరీష్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.