సీఎం పడ్నవీస్ సతీమణి డ్రస్ పై సోషల్ మీడియాలో చర్చ

పల్లవి, వెబ్ డెస్క్ : మహరాష్ట్ర సీఎం పడ్నవీస్ భార్య అమృత ముంబైలోని గణేశ్ నిమజ్జనాలు ముగిసిన నేపథ్యంలో హీరో అక్షయ్ కుమార్ తో కలిసి బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ లో పాల్గొని ముంబై జుహు బీచ్ ని శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ‘ మన సముద్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేయాల్సిన బాధ్యత మనదే ‘ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమృత ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది సరైన ఔట్ ఫిట్ కాదని సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పబ్లిక్ ఈవెంట్లకు, జనాల్లోకి వెళ్లినప్పుడు శరీర భాగాలు కనిపించేలా దుస్తులు వేయడం సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని మరికొంతమంది నెటిజన్లు మద్ధతు పలుకుతున్నారు.