కాళోజి జయంతి వేడుకల్లో పాల్గొన్న బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్

పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు గారి 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జయంతి కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ మరియు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ డిప్యూటి డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ సతీష్ కుమార్, రీసెర్చ్ అసోసియేట్ లక్ష్మీనారాయణ మరియు ఇతర కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ జి. నిరంజన్ మాట్లాడుతూ కాళోజి గారు గొప్పకవి, ప్రజల పక్షపాతి, తెలంగాణ యాసను అవహేళన చేసిన కొందరికి వారి ధీటైన కవితలతో సమాధానం ఇచ్చారు. అలాగే వారు నిజాంకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చురుకుగా పనిచేసారు. శాసన మండలి సభ్యులుగా కూడా సేవలందించారు. వారి పుస్తకం నా గొడవ ఎంతో ప్రాచుర్యం పొందింది. అలాగే వారి ప్రముఖ నినాదం ‘పుట్టుక నీది.. చావు నీది… బతుకంతా దేశానికి’ అని ఎంతో స్ఫూర్తి నింపారని తెలిపారు.వారికి సంతాపం తెలుపుతూ రెండు నిముషాల మౌనం పాటించడం జరిగింది