ఇంట్లోనే షుగర్ టెస్టు చేసుకుంటున్నారా..?

పల్లవి, వెబ్ డెస్క్ : ఈరోజుల్లో షుగర్, బీపీ వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉంటారు. కొంతమంది ఆసుపత్రులకు , క్లినిక్ లకు వెళ్లలేక ఇంట్లోనే షుగర్ టెస్టు చేసుకుంటారు. షుగర్ టెస్టు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కచ్చితమైన రీడింగ్స్ రావాలంటే మాత్రం ఈ తప్పులను చేయకూడదని, తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు పలు సూచనలు, సలహాలు ఏమి ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది భోజనం తిన్న వెంటనే షుగర్ టెస్టు చేసుకోకూడదు. అన్నం తిన్న వెంటనే షుగర్ టెస్టు చేసుకుంటే రీడింగ్స్ విషయంలో ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం రెండు గంటల తర్వాత షుగర్ టెస్టు చెక్ చేసుకుంటే కచ్చితమైన ఫలితం వస్తుంది. అయితే షుగర్ లెవల్స్ ను తెలుసుకునేందుకు రోజూ ఒకే సమయంలో చెక్ చేసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
చేతి వేలి చివరలో నాడులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అక్కడ నీడిల్ తో గుచ్చుకుని చెక్ చేసుకుంటారు.ఇలా చేసుకోవడం వల్ల నొప్పి కలిగే అవకాశం ఎక్కువ ఉంది. టెస్టు చేసుకునే ప్రతిసారీ చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఇంట్లో షుగర్ టెస్టింగ్ చేసుకుంటేనే ఆ వ్యాధి ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.