నాకు ఏ కష్టం వచ్చిన ఆయనకే చెప్పుకుంటాను: బాబు మోహాన్

బాబూ మోహన్ .. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..!. అంతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే.. మంత్రిగా కూడా పని చేసిన అనుభవం బాబూ మోహన్ ది. కొన్నాళ్లుగా ఇటు సినిమాకు.. అటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్న బాబూ మోహన్ ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో పలు అంశాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ” నేను ఒకప్పుడు రవీంద్రభారతి బయట నిలబడి, అందులో జరిగే నాటికలను చూస్తే చాలని అనుకునేవాడిని.
అలాంటి రవీంద్రభారతిలోనే నాకు చాలా సార్లు సన్మానాలు జరిగాయి. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితోను కలిసి నటించాను. వాళ్లంతా కూడా నన్ను ఎంతో గౌరవంతో.. అభిమానంతో చూసుకున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు” అని ఆయన అన్నారు. ‘కోట శ్రీనివాసరావు… నేను కలిసి చాలా సినిమాలలో నటించాము. సీనియర్ నటులైన రేలంగి – రమణారెడ్డి, అల్లు రామలింగయ్య – రావు గోపాలరావు మాదిరిగా మా జోడీకి గుర్తింపు రావడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉంటాము.
నేను ఎవరి మనసు కష్టపెట్టలేదు గనుక ఎవరికీ సారీ చెప్పను. తొలినాళ్లలో నన్ను ఎంకరేజ్ చేసిన దర్శకులకు థ్యాంక్స్ చెప్పుకుంటాను”.”నాకు కష్టం వస్తే …ముందుగా దేవుడికే చెప్పుకుంటాను. మా పెద్దబ్బాయి ప్రమాదంలో పోయినప్పుడు, ఎందుకు ఇలా చేశావని దేవుడిని నిలదీశాను. ఆ తరువాత నేను నా కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే కొడుకుపోయిన కష్టానికి మించిన కష్టం ఏముంటుంది” అంటూ ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు