నా కొడుకే వైఎస్సార్ వారసుడు – వైఎస్ షర్మిల

పల్లవి, వెబ్ డెస్క్ : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు నాకొడుకు అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ ” ముమ్మాటికి నా కుమారుడు వైఎస్సార్ వారసుడే. నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే వైసీపీ నేతలు ఇంతలా స్పందిస్తున్నారంటే నా కుమారుడు అంటే అంత భయమా..?. ఎవరెన్ని మాట్లాడిన వాగినా నా కొడుకు ఆయన వారసుడే అని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ ఐడియాలజీ లేదు. ఎవరు చెప్పారని ఆర్ఎస్ఎస్ వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతు పలికారు అని ఆమె ప్రశ్నించారు.