జనసేన ఎంపీకి బిగ్ షాక్
Janasena Kakinada MP

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన జనసేన పార్టీకి చెందిన ఎంపీకి సైబర్ క్రైమ్ నేరగాళ్లు బిగ్ షాకిచ్చారు. ఆంధ్రాలోని కాకినాడ పార్లమెంట్ జనసేన సభ్యులు అయిన ఉదయ్ శ్రీనివాస్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో టీ టైమ్ అనే సంస్థకు చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గా గంగిశెట్టి శ్రీనివాస్ రావు పని చేస్తున్నారు. గత నెల ఇరవై రెండో తారీఖున గంగిశెట్టి శ్రీనివాస్ రావుకు ఓ కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆనంబరు వాట్సాప్ డీపీగా జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటో ఉండటంతో అది నిజంగానే ఎంపీ నంబరు అని. నిజంగానే ఎంపీ స్వయంగా ఆ మెసేజ్ చేశారని శ్రీనివాస్ నమ్మాడు. కొత్త ఫోన్ నంబరును ఉపయోగిస్తున్నా. నాకు అత్యవసరం ఏర్పడింది.
కొంతమొత్తం డబ్బు అవసరం ఉంది. పంపించూ అంటూ పదే పదే మెసేజ్ లు ఆనంబరు నుంచి సైబర్ నేరగాళ్లు పంపారు. ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గంగిశెట్టి శ్రీనివాస్ రావు పదకొండు సార్లు మొత్తం తొంబై రెండులక్షలను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. టీ-టైమ్ సంస్థకు చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ కొత్త ఫోన్ నెంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫొటో ఉండటంతో, అది నిజంగానే ఎంపీ మెసేజ్ అని మేనేజర్ నమ్మాడు.
కొత్త ఫోన్ నెంబరు ఉపయోగిస్తున్నా.. అత్యవసరం.. కొంత మొత్తం పంపించు అంటూ పదే పదే మెసేజ్‌లు పంపాడు. ఆ మెసెజ్‌లు ఎంపీ ఉదయ్ చేశారని నమ్మిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా పదకొండు సార్లు మొత్తం రూ.92 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత ఇది ఫేక్ అని తెలుసుకున్న గంగిశెట్టి శ్రీనివాస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.