పిల్లలకు ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ తాగిస్తున్నారా..?
mango juice

పల్లవి, వెబ్ డెస్క్ : నేటి ఆధునీక బిజీ బిజీ లైఫ్ స్టైల్ లో ఇంట్లో మేకింగ్ ఫుడ్ తీసుకోవడం మానేస్తారు కొంతమంది. వారితో పాటు ఇంట్లో ఉన్న పిల్లలకు సైతం బయట ఫుడ్ అలవాటు చేస్తారు.ఈ క్రమంలో ప్యాకేజ్డ్ లో ఉండే జ్యూసులను సైతం ఇస్తుంటారు. అయితే ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ ను పిల్లలకు అందజేస్తారు.
ఇలా ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ ను పిల్లలకు ఇవ్వడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ ను తాగించడం కంటే ఇంట్లో తయారు చేసిన సహజమైన మామిడి పండ్ల రసాన్ని తాగించడం ఆరోగ్యానికి మంచిదని వారు చెబుతున్నారు.
ఎందుకంటే బయట తయారు చేసే మ్యాంగో జ్యూస్ లో కృత్రిమ రసంలో E110 అనే సింథటిక్ రంగు, రుచి కోసం రసాయనాలు కలుపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాకేజ్డ్ జ్యూస్ , సహజ మామిడి రసాన్ని పరీక్షించారు. రెండింటీలో సోడియం హైపోక్లోరైట్ వేసి పరీక్షించగా కృత్రిమ జ్యూస్ రంగు కోల్పోవడాన్ని గమనించారు.