భర్త సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఏకంగా..?

పల్లవి, వెబ్ డెస్క్ : సినిమాకు తీసుకెళ్లలేదని ఓ భార్య తీసుకున్న నిర్ణయం అందర్నీ తీవ్ర విష్మయానికి గురిచేసిన సంఘటన ఇది. తమిళనాడు రాష్ట్రంలోని తురుప్పూర్ జిల్లా కాంగయం పడియాండిపాళయం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ జీవాకు సౌమ్య అనే యువతితో ఏడు నెలల క్రితం పెళ్లైంది.
సౌమ్య కాంగయంలోని ఓ ఫుట్ వేర్ షాపులో పనిచేస్తూ ఉండేది. ఈ క్రమంలో తనను సినిమాకు తీసుకెళ్లమని భర్త అయిన జీవాను అడిగింది. గత కొన్ని వారాలుగా అడుగుతున్న జీవా నుంచి ఎలాంటి సమాధానం లేదు. తను ఎంత బ్రతిమిలాడిన.. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఇదే విషయాన్ని సౌమ్య తన తల్లికి ఫోన్ చేసి చెప్పి మరి తన ఆవేదనను వెల్లడించింది.
అయితే మంగళవారం తన భర్త జీవా ఆటోకు వెళ్లడంతో సౌమ్య హఠాత్తుగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి అనంతరం ఇంటికి వచ్చిన జీవా తన భార్య ఉరేసుకుని ఉండటాన్ని గమనించి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. తక్షణమే తేరుకుని ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కాంగయం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.