వాళ్ళు ఉసిరికాయ తినవచ్చా..?

పల్లవి, వెబ్ డెస్క్ :ఉసిరి కాయ గురించి తెలియనివాళ్లు ఎవరూ ఉండరు. ఉసిరి కాయ చెట్నీ అంటే చాలా మక్కువతో తింటారు. ఉసిరి కాయ తింటే అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో మరీ ఎక్కువగా తింటే కూడా ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు కొన్ని సార్లు హానికరంగా మారవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక బీపీ ఉన్నవారు ఉసిరి కాయలు తినొచ్చు. కానీ తక్కువ బీపీ ఉన్నవారికి ఇవి హానికరం. అందుకే తక్కువ బీపీ ఉన్నవాళ్లు ఉసిరికాయలు మితంగా తింటే ఆరోగ్యకరం. అతిగా తింటేనే అనారోగ్యం అని వైద్యులు చెబుతున్నారు.